రైతులు పామ్ ఆయిల్ పంటపై మొగ్గు చూపాలి

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 సాలూర : రైతులు తప్పనిసరిగా సేంద్రీయ ఎరువులను మాత్రమే వాడాలని సంఘ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ సూచించారు.సాలూర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అర్థ సంవత్సర గణన కార్యక్రమంలో భాగంగా సంఘ ప్రత్యేక అధికారి అధ్యక్షతన గురువారం సంఘ ఆవరణలో మహాజన సభ నిర్వహించారు.ఇంచార్జ్ సీఈఓ సంజీవ్ సంఘ నిర్వహణకు సంబంధించిన జమా ఖర్చులను రైతుల సమక్షంలో వివరించి ఆమోదించారు.రైతులు పంట సాగు కొరకు రసాయన ఎరువులను వాడటం వలన చాలా మంది ప్రజలు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని,రైతులు సేంద్రియ ఎరువులను వాడకంపై మొగ్గు చూపాలని సభా వేదికగా రైతులకు తెలిపారు.సేంద్రియ ఎరువులు వాడుతామంటూ రైతులచే ప్రతిజ్ఞ చేయించారు.రైతులు ఫామాయిల్ పంటను వేయడానికి ముగ్గు చూపాలని కోరారు.ఇందు కొరకు ప్రభుత్వ సహాయంగా డ్రిప్ పై 80 శాతం నుండి 100 శాతం వరకు సబ్సిడీ ఇస్తూ నిర్వహణపై కూడా సహాయం మొత్తం ఎకరాకి 40 వేల నుంచి 45 వేల వరకు రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు.మొక్కజొన్న కొనుగోలు కొరకు ప్రభుత్వం గతంలో ఉన్న నియమాలను సవరిస్తూ రైతులు పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని రైతుల సమక్షంలో తీర్మానం చేశారు. కార్యక్రమంలోసంఘ రైతులు,సంఘ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *