
పయనించే సూర్యుడు మార్చ్ 27 పాపన్నపేట మండల రిపోర్టర్ దుర్గాప్రసాద్ రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని పాపన్న పేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “అర్రేవ్ అ లీవ్” కార్యక్రమం లో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం లో ఉపసర్పంచ్, వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా” అరైవ్ -అలైవ్” అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు గ్రామ పంచాయతీ లలో ప్రజలకు ప్రమాదాల నివారణకు తమ వంతు గా ప్రజలకు రోడ్డు భద్రత, నియమాలు, నిబంధనల పై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణకు ఎంతో ప్రాధాన్యత నిచ్చి అరైవ్- అలైవ్ కార్యక్రమం తో ప్రత్యేక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలన్న తలంపుతో చేపట్టిన వారోత్సవాల్లో బాగంగా మెదక్ ఎస్పీ శ్రీనివాస్ రావు ఆదేశాల మేరకు గురువారం ప్రజా ప్రతినిధులను సైతం అవగాహన సదస్సులో భాగస్వాములుగా చేయాలన్న తలంపుతో గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు అవగాహన కల్పించారు.వాహనదారులు హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలకు రక్షణ కవచంల ఉంటుందని అందువల్ల ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ తోపాటు సీటు బెల్టు ధరించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యం, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, హెల్మెట్, సీటు బెల్టు ఉపయోగించకపోవడం వల్ల జరుగుతున్నాయన్నారు. రోడ్డు భద్రత అనేది కేవలంపోలీసుల బాధ్యత మాత్రమే కాదని ప్రతి వాహనదారుడు ప్రతి పౌరుడు బాధ్యతగావ్యవహరించినప్పుడే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చునని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వారికి సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు రాంగ్ రూట్లో నడపకూడదని తెలియజేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్లను ఉప యోగించొద్దని, సెల్ ఫోన్ లో ఇతరులతో మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలని సూచించారు. చలికాలంలో మంచు కారణంగా ఓవర్టేక్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఇఓ , వివిధ గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, శిక్షకులు పోలీసులు ఉన్నారు.