రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత’

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత' *హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి * ట్రాఫిక్ ఎస్ఐ మహేష్

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 ఎడపల్లి:జిల్లా పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ఎడపల్లి మండలం మంగల్పాహాడ్ చౌరస్తా వద్ద రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై మహేష్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అతివేగం నిర్లక్ష్యం ప్రమాదాలకు దారితీస్తాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కందకట్ల రాంచందర్ బోధన్ ఎడపల్లి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *