వరల్డ్ లార్జెస్ట్ పార్టీబిజెపి తిరుగులేని శక్తిగా బిజెపి

★ గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా బిజెపి విస్తరించింది ★ కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేశాం గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేస్తాం ★ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి

పయనించే సూర్యుడు మార్చి 27 కరీంనగర్ న్యూస్: నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్ సిద్ధాంతంతో, ప్రపంచంలోనే అత్యధిక కార్యకర్తలు కలిగిన పార్టీగా , వరల్డ్ లార్జెస్ట్ పార్టీగా , తిరుగులేని శక్తిగా భారతీయ జనతా పార్టీ అవతరించిందని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ 24 వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజున డివిజన్లోని గుండి హనుమాన్ వద్ద నూతనంగా నిర్మించిన బిజెపి జెండా గద్దె , పార్టీ జెండా ఆవిష్కరణ సందర్భంగా గంగా డి కృష్ణారెడ్డి పై వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ప్రపదమంగా డివిజన్లో కాషాయ జెండా ఎగిరిందని, కార్పొరేటర్ గా సత్యనారాయణ రెడ్డి ఘన విజయం సాధించి, డివిజన్లో పార్టీ జెండా గద్దెను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు. నేడు బీజేపీ గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా విస్తరించిందన్నారు. బిజెపి మోది సర్కార్ పాలనతోనే నేడు దేశం సుభిక్షంగా ఉందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలు , అగ్రరాజ్యాలు యుద్దాలతో కొట్టుమిట్టాడుతుంటే, మోదీ ప్రభుత్వం సుస్థిర పాలన కొనసాగిస్తుందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు నేడు మోడీ ప్రభుత్వ పాలన విధానం దిక్సూచిగా మారిందన్నారు. భారతదేశం నేడు విశ్వ గురువు స్థాయికి చేరుకుందన్నారు. దేశ భవిష్యత్తు కోసం , ప్రజల సంక్షేమం , అభివృద్ధి, భద్రత కోసం బిజెపి నిరంతరం ఆలోచిస్తుందన్నారు. కానీ దేశంలోని అనేక పార్టీలు మాత్రం బిజెపి విధానాలకు భిన్నంగా ఉంటాయని , ఆయా పార్టీ లు ,మనం బాగుంటే చాలు, మన కుటుంబం బాగుంటే చాలు అనుకునే స్వార్దం తో నే నేటికీ రాజకీయాలు చేస్తున్నాయని ఘాటుగా విమర్శించారు. భవిష్యత్తు అంతా బిజెపి దేనని , కరీంనగర్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేసినట్టే , గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేసి తీరుతామని ఆయన ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వమేనన్నారు.ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీమేయర్: వై. సునీల్ రావు,వెస్ట్ జోన్ అధ్యక్షులుజాడి బాల్ రెడ్డి, అధికార ప్రతినిధి: ఊగేల సుధాకర్ పటేల్, నాయకులుగుజ్జ శ్రీనివాస్, డివిజన్ వాసులు అట్ల జగన్ రెడ్డి, కుటాడి శ్రీనివాస్, విష్ణు వర్ధన్, ప్రశాంత్, స్వామి, ఆంజనేయులు, గంగసాని మునీన్దర్, దాసరి రాజి రెడ్డి, తదితరుల పాల్గొన్నారు.