విశ్వం విద్యాసంస్థల అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌కు ఫిర్యాదు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 27 03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు (అన్నమయ్య )జిల్లా అధ్యక్షులు,…వెంకట్ యాదవ్ విశ్వం విద్యాసంస్థల్లో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి చిత్తూరు(అన్నమయ్య )జిల్లాల అధ్యక్షులు వెంకట్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశ్వం ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు స్కూల్స్ మరియు ఇతర కాలేజీలలో కూడా విద్యార్థుల నుండి అక్రమంగా వివిధ పేర్లతో ఫీజులు, ఫైన్స్ రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను, వారి కుటుంబాలను ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లుతూ, విశ్వం విద్యాసంస్థలు విద్యార్థుల నుండి క్రమంగా వసూలు చేసిన కోట్ల రూపాయల ఫీజులను పూర్తిగా తిరిగి చెల్లించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. అలాగే, ఈ సంస్థల అధినేత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ అక్రమాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అందువల్ల, విశ్వం విద్యాసంస్థల (ఇంజనీరింగ్, స్కూల్స్, కాలేజీలు) అనుమతులను తక్షణమే రద్దు చేయాలి విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన మొత్తం మొత్తాన్ని తిరిగి చెల్లించాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయం కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *