పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 27 శాతవాహన యూనివర్సిటీ వికసిత్ భారత్-2047 జాతీయ సదస్సులో మొదటి రోజు ఇచ్చిన ప్రజెంటేషన్ లో జగిత్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సుహానా కౌసర్ నీ ఉత్తమ ప్రజెంటేషన్ గా ఎంపిక చేసి అట్టి ఉత్తమ ప్రెసెంటేషన్ అవార్డును శాతవాహన విశ్వవిద్యాలయం ఉపకులపతి చేతుల మీదుగా విద్యార్థికి అందించి ప్రత్యేకంగా అభినందించారు. కామర్స్ & బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల పరిధిలోని కామర్స్ విభాగం ఆధ్వర్యంలో “వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో కామర్స్ మరియు మేనేజ్‌మెంట్ యొక్క మార్పు దోహదం” అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ యు. ఉమేష్ కుమార్ గహాజరై, దేశ ఆర్థికాభివృద్ధిలో కామర్స్ మరియు మేనేజ్‌మెంట్ రంగాల ప్రాధాన్యతను వివరించారు. ఇట్టి జాతీయ సదస్సులో పాల్గొన్న అధ్యాపకులను మరియు ఉత్తమ ప్రజెంటేషన్ అందించిన రామకృష్ణ డిగ్రీ కళాశాల అధ్యాపకులను కూడా మెచ్చుకున్నారు ఇలాంటి ప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికితీస్తూ రాబోయే రోజుల్లో గ్లోబలైజేషన్లో వచ్చే సవాళ్లను ఎదుర్కొని దానికి పరిష్కారం చూపే విధంగా తయారవుతారని ఉత్తమ ప్రజెంటేషన్ అందించిన జగిత్యాల సుహానా కౌసర్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు ఇలాంటి విద్యార్థులతో పాటు పరిశోధకులు మరియు అకాడమిక్ వర్గాలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఇట్టి సదస్సు లో ఉపకులపతి ఆచార్య సోమేశ్ కుమార్ , రిజిస్టర్ పి సతీష్ కుమార్ , కామర్స్ విభాగ డీన్ ఏ. రవి , సెమినార్ డైరెక్టర్ డాక్టర్ డి.హరికాంత్ పాల్గొన్నారు కీనోట్ స్పీకర్‌గా భారత కామర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ప్రొఫెసర్ రవి కుమార్ జాస్తి పాల్గొని, ఆధునిక వ్యాపార ధోరణులు, డిజిటల్ మార్పులు మరియు గ్లోబల్ మార్కెట్ సవాళ్లను అధిగమించడంలో మేనేజ్‌మెంట్ నైపుణ్యాల అవసరాన్ని వివరించారు.