శ్రీరామనవమి సందర్భంగా రామోజీపేట రామాలయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – విద్య దంపతులు

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి /27:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలో శ్రీసీతారామ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా రాజన్నసిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, వారి సతీమణి,తో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయమే స్వామివారి ఆలయానికి సతీ సమేతంగా చేరుకున్న సంగీతం శ్రీనివాస్, ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందించారు.