పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి27.03.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సి.కృష్ణమూర్తి బదిలీ అయ్యారు.. తిరుపతి లోని జెఈఓ (హెల్త్ అండ్ఎడ్యుకేషన్) కార్యాలయానికి సి.సి.గా బదిలీ చేయడం జరిగింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన టీటీడీ యజమాన్యం… పది నెలల పాటు ఆలయంలో ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహించడం జరిగింది… శ్రావణ మాసం, వైకుంఠ ఏకాదశి మరియు బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది.. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది… ఆలయంలో ప్రతి శనివారం దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది.. అదేవిధంగా ప్రతిరోజూ ఉదయం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము.. ఆలయంలో పోటు (వంటగది) నిర్మాణం పూర్తి కావడానికి, రథ మండపముకు షెడ్ ఏర్పాటు కావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. ఆలయ నిర్వహణలో సహాయ సహకారాలు అందించిన ఆలయ అర్చకులకు, సిబ్బందికి, దాతలకు, ఉభయదారులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఆలయ నూతన ఇన్ స్పెక్టర్ గా జూనియర్ అసిస్టెంట్ యశ్వంత్ నియమితులైనారు..