పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 27.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగునూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) మామిడి సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటల దిగుబడి అధికంగా వస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గువ్వల రమేష్ రెడ్డి అన్నారు గురువారం స్థానిక మండల పరిపాలన భవన సముదాయంలో ఉద్యానవన శాఖ నుంచి మంజూరైన మామిడి కవర్లను ఆయన పంపిణీ చేశారు ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించి అమలు చేస్తుందన్నారు రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు అనంతరం ఉద్యానవన శాఖ తరపున మంజూరు అవుతున్న సంక్షేమ పథకాలు వంటివి వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లీలావతి ఉద్యానవన శాఖ అధికారి సంతోషి నికుమారి తెలుగుదేశం పార్టీ నాయకులు పూల చంద్రమౌళి బోయకొండ సుబ్బు విజయ భాస్కర్ రెడ్డి హమీద్ భాషా ముని వెంకటప్ప చంగల్ నాయుడు సోము రాధాకృష్ణ కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు