పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 27 సాలూర : సాలూర మండల కేంద్రానికి చెందిన రైతు కేజీ.గంగారాంకు అరుగైన గౌరవం దక్కింది.వసుంధర విజ్ఞాన వికాస మండలి,వైద్యుల విజ్ఞాన వేదిక సారథ్యంలో హైదరాబాద్ నగరంలోని రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా సాలూర గ్రామ రైతు కేజీ గంగారాంకు పుడమిపుత్ర అవార్డును అందజేశారు.వ్యవసాయ రంగంలో ఆయన రైతుల పక్షాన ఉంటూ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రభుత్వానికి అధికారులకు తెలియజేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయడంతో పాటు అన్ని రకాల పంటలను పండించడంలో ఆయనకే సాటి అన్న విధంగా అవలంబిస్తున్న విధానాలను గుర్తించి ఉత్తమ రైతు కేజీ గంగారాంను జాతీయ పుడమిపుత్ర అవార్డుకు ఎంపిక చేశారు.గురువారం ఆయనకు ప్రముఖులు అవార్డును ప్రధానం చేశారు.జాతీయ అవార్డుకు ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికి అవార్డు గ్రహీత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.బోధన్ మరియు సాలూర మండలాల ప్రముఖులు,ప్రజాప్రతినిధులు,ప్రజలు అవార్డు గ్రహీతకు శుభాభినందనలు తెలిపారు.