సీత రాములు కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లు పరిశీలించిన గొల్లపెల్లి ఎస్ ఐ ఎం. కృష్ణ సాగర్ రెడ్డి

పయనించే సూర్యుడు 27-3-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ రామనవమి సందర్బంగా మండల కేంద్రం లో గల సీత సమేత కల్యాణ రామచంద్ర స్వామి దేవాలయం లో సీత రాములు కళ్యాణమహోత్సవ వేడుక లో భాగంగా స్వామి వారి పచ్చని పందిరి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.కాగా ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులు హాజరు అవుతారు కల్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదు అని ఆలయ కమిటీ తగు ఏర్పాటు చేస్తుంది. ఆ ఏర్పాట్లు పరిశీలించిన గొల్లపెల్లి ఎస్ ఐ కృష్ణ సాగర్ రెడ్డి. మరియు గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి. ఉప సర్పంచ్ గురిజెల బుచ్చిరెడ్డి. బి జె పి నాయకులు కట్ట మహేష్. పి జె ఎ సి జగిత్యాల అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి.ముస్కు నారాయణ రెడ్డి. ముస్కు కొండల్ రెడ్డి.తడూరి సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకం భూమయ్య. బోనగిరి నాగరాజు. తడూరి వంశీ కృష్ణ. శాతల్ల లచ్చయ్య. గడ్డం గంగాధర్.ముందాం సురేష్ కలకోట సత్యం సజ్జనపు రాములు.తదితరులు పాల్గొన్నారు.