సూరంపల్లి పాఠశాల విద్యార్థుల సత్తా – 21 మందిలో 18 మందికి గురుకుల సీట్లు

పయనించే సూర్యుడు మార్చి 27 రాజేష్) దౌల్తాబాద్ మండల పరిధిలోని సూరంపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచారు. పరీక్షకు హాజరైన 21 మంది విద్యార్థుల్లో 18 మంది విద్యార్థులు సీట్లు సాధించడం విశేషంగా నిలిచింది. ఈ విజయంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యంగా విద్యార్థిని చామంతి సహస్ర 91 మార్కులు సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని ఉపాధ్యాయులు ప్రశంసించారు. విద్యార్థుల విజయానికి పాఠశాల ఉపాధ్యాయులు బి. వేణుగోపాల్, ఎస్. భాను ప్రకాష్, కె. కరుణ, టి. రేణుక, జి. రేఖ ప్రత్యేక శిక్షణ ఇచ్చి కృషి చేశారు. విద్యార్థుల విజయంపై గ్రామస్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు. ఈ ఫలితాలు పాఠశాల విద్యా ప్రమాణాలను ప్రతిబింబిస్తున్నాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.