స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం

* మందసలో స్వచ్ఛ రథం ప్రారంబించిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 27 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్.ప్రజా ఆరోగ్యానికి స్వచ్ఛతే కీలకం, స్వచ్ఛ సంకల్పమే ధ్యేయంగా మందస మండలం మందస ఎంపిడిఓ కార్యాలయం వద్ద  స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమo లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొన్నారు. స్వచ్ఛాంద్ర వాహనాన్ని ప్రారంభించి. స్వచ్ఛ సంకల్పమే ప్రభుత్వ చేయమని వాహనాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల పరిశుభ్రతే రాష్ట్రాభివృద్ధికి పునాది అని, ప్రతి గ్రామం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యమని ఆమె పేర్కొన్నారు.ఇంటింటికీ చెత్త సేకరణకు ప్రత్యేక వాహనం. ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన గ్రామాల నిర్మాణం అనే నినాదంతో ముందుకు పోవాలని కోరారు. అదేవిధంగా స్వచ్ఛతా సేవ కార్యక్రమంలో భాగంగా హరిపురం సచివాలయం మరియు బుడార్సింగి సచివాలయాల సంబందించి స్వచ్ఛ రథాలను కూడా గురువారం ప్రారంభించారు.అన్ని సంపదలకల్లా గొప్పది ఆరోగ్యమే, ప్రతి కుటుంబానికి ఆరోగ్యాన్ని అందించడానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని – ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో వైద్య సౌకర్యాలను మెరుగుపరచడమే కాకుండా ప్రజలలో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ స్వచ్ఛ రథాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, మందస మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భావన దుర్యోధన,శాలిన మాధవరావు , మందస, బాలిగాం పి ఏ సి స్ అధ్యక్షులు తమిరి భాస్కరావు, లబ్బ రుద్రయ్య, లచ్చయ్య, డొంకరు తిరుపతి, రాజన మహేశ్, గార కృష్ణారావు, రట్టి లింగరాజు, ముంజేటి చంద్రశేఖర్,చౌదరి మురళి , దేవరశెట్టి మార్కండేయులు,మట్ట మహేష్ జనసేన సంతోష్ పండా, పలాస మండల నాయకులు తమ్మినేని గంగారాం, కోరికనా శంకరావు ఎంపీడీఓ సిబ్బంది, వెలుగు సిబ్బంది, తెలుగుదేశం ఇతర నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *