అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

పయనించే సూర్యుడు ,మార్చి 28 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సారపాకలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీశ్రీశ్రీ శిరిడి పుష్కర ద్వారకా సాయిబాబా మందిరంలో శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నులు పండుగ వేద పండితుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు నిర్వహించడం జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కన్నులారా కళ్యాణం ను తిలకించారు. అనంతరం మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు సాయంత్రం 6 గంటలకు స్వామివారిని పురవీధుల్లో ఊరేగింపుగా తాళమేళలతో కోలాటం నృత్యాలతో రథోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ స్వామి వారి కల్యాణ మహోత్సవం శ్రీశ్రీశ్రీ షిరిడి పుష్కర ద్వారకాసాయ మందిరంలో నిర్వహించి కళ్యాణ మహోత్సవం ను కన్నులారా వీక్షించే అవకాశం కల్పించిన ఆలయ కమిటీ వారికి ధన్యవాదాలు తెలిపారు