పయనించే సూర్యుడు// మార్చ్ 28// హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి: శ్రీరామనవమి సందర్భంగా వెన్నంపల్లి గ్రామంలోశ్రీ శివాలయం ఆలయంలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేదమంత్రాలతో సీతారాముల కళ్యాణం జరిపించారు. పండితులు శ్రీ సీతా రాముల కళ్యాణం జరిపిస్తూ శ్రీరామనవమి విశిష్టతను తెలిపారు. భక్తులు భక్తిశ్రద్ధలతో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.