పయనించే సూర్యుడు మార్చి 28 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నాదెండ్ల వారి కండ్రిగ గ్రామానికి చెందిన నెలవల సుప్రజ కి మెదడు వాపు వ్యాధితో బాధపడుతుందని తెలుసుకొని ఆర్థిక సహాయం అందించాలని చిరంజీవి సేవా సంఘ0 దాతల సహాయంతో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి సేవా సంఘం ఆర్థిక సహాయం అందించడం జరిగినది నెలవల సుప్రజకి వైద్య ఖర్చులకి 23000 అందించిన చిరంజీవి సేవా సంఘం నాయకులు మాభాష నక్క హరిబాబు కయ్యాలకోటి ఆవుల రమణ, చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మాభాష మాట్లాడుతూ దాతలు సహకారంతో వైద్య ఖర్చులకి మెదడు వాపు వ్యాధితో బాధపడుతోంది. తెలుసుకొని ఆమెకు ఈరోజు అందజేశామని ఆమె త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు అలాగే దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు