పయనించే సూర్యుడు మార్చి 28 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప ఆధ్వర్యంలో వచ్చే నెల 5 తేదీన కులదైవం శ్రీశైలం మల్లికార్జున సన్నిధిలో అఖిలభారత కురువంశ అన్నదాన సత్రంలో కార్యక్రమం జరగనుంది* అందుకుగాను ఈరోజు కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది చైర్మన్ మాట్లాడుతూ వచ్చేనెల 4 మరియు 5 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కురువ సంఘం రెన్యువల్* చేయడంతో పాటు కురువ కుల బంధువులకు సంబంధించిన ప్రభుత్వ తరపున మన హక్కుల గురించి చర్చించడం జరుగుతుంది అలాగే కురుబలు అన్ని రంగాల్లో ఎదిగినారు కానీ రాజకీయాల్లో అంతంత మాత్రం గుర్తిస్తున్నారు అందుకుగాను వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కురుబలకు మరిన్ని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కాని కేటాయించాలని ఈ విషయం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని చర్చించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎస్ సవితమ్మ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు బస్తీపాటి నాగరాజు మరియు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు పార్థసారథి హాజరు కావడం జరుగుతుంది అందుకే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాల కురుబ నాయకులను పిలవాలని ఒక దృఢ సంకల్పంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప నిర్ణయించుకున్నారు అందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ కుల పెద్దలతో చర్చించి వచ్చే నెల 5తేదీన కుల బాంధవులు అందరూ రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన కుల బంధువులు యువకులు మురళి శ్రీనివాసులు మల్లికార్జున సిజి శివయ్య బండారు శ్రీనివాస రామచంద్ర మహేంద్ర శివ నారాయణ ఆర్టీసీ నారాయణ కె రామలింగ మరియు తదితరులుపాల్గొన్నారు.