ఇల్లంతకుంటలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

పయనించే సూర్యుడు న్యూస్:మార్చి/28:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి:సాయిరెడ్డి బొల్లం:రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పాతవాడ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానం వద్ద నేడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో అంగరంగా వైభవంగా నిర్వహించారు. ముందుగా గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి స్వామి వార్లకు సమర్పించేందుకు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు మరియు పూస్తే మట్టెలను గ్రామ ప్రజలందరితో కలిసి సర్పంచ్ ఎం.రాజు మరియు గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు ఘనంగా ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చారు. మంగళ వాద్యాలు, భజనలు మధ్య భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టి స్వామివార్లకు ఒడిబియ్యం సమర్పించుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కళ్యాణం మహోత్సవం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మూగు నాగరాజు శర్మ,వార్డు సభ్యులు రేగుల కార్తీక్,ఎర్రోజు దీపికా,మామిడి శ్రీను,రాకం సుమన్,కొట్టే ప్రమీల,అంతటి శ్రీకాంత్,కునబోయిన రఘు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ ఆహ్వాన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు, వర్తక వ్యాపారులు, యువజన సంఘాల సభ్యులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *