ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలిసిస్ రోగికి రక్త దానం చేసిన ముస్తఫా

పయనించే సూర్యుడు మార్చి 28 ఉట్నూర్ మండలం రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా ఉట్నూర్: జైనూర్‌కు చెందిన జరీనా బేగం (45) తీవ్ర కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలిసిస్ చికిత్స పొందుతున్నారు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది రోగి పరిస్థితి తెలుసుకున్న మహమ్మద్ ముస్తఫా వెంటనే స్పందించి అవసరమైన రక్త దానం చేసారు అలాగే బ్రదర్స్ హ్యూమానిటీ ఫౌండేషన్ అధ్యక్షుడు రాహెల్ ఖాన్ నేతృత్వంలో సంయుక్త కార్యదర్శులు నవీన్ అత్తార్ మరియు సయ్యద్ ఇమ్రాన్ ఆసుపత్రిని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు రోగికి ధైర్యం చెప్పి అండగా నిలిచిన సేవా సంస్థ సభ్యులను స్థానికులు అభినందించారు జరీనా బేగం త్వరితగతిన కోలుకోవాలని ప్రాంత ప్రజలు ఆకాంక్షించారు.