ఏలేశ్వరంలో అంగరంగ వైభవంగా శ్రీరాముని శోభాయాత్ర

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 28(ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ ) : ఏలేశ్వరం లింగంపర్తి రోడ్ లో సత్తమ్మతల్లి గుడి వద్ద నుండి డొక్కా సీతమ్మ సేవాసమితి సభ్యులు మెల్లిపాక నాగేంద్ర ఆధ్వర్యంలో శ్రీరాముని శోభాయాత్ర శుక్రవారం ప్రారంభమైంది.ఈ శోభాయాత్ర యాత్రలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు,వాసవి క్లబ్ సభ్యులు,ఆర్ఎస్ఎస్ సభ్యులు,దయానంద సేవ ఆశ్రమ విద్యార్థులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా శ్రీరామనవమి రోజు బైకులతో ర్యాలీగా శోభాయాత్ర చేయడం జరుగుతుందని,సత్తమ్మ తల్లి గుడి వద్ద నుండి లింగంపర్తి, ఏలేశ్వరం బాలాజీ చౌక్ సెంటర్, పురవీధుల గుండా శోభాయాత్ర కొనసాగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గోవిందు,గట్టెం వెంకటరమణ,సిరి ఫుడ్ కృష్ణ,పిరాట్ల రవి,పాబోలు దేవి,పాదుర్తి సురేష్, ప్రగళ్లపాటి కామేష్,కటకం కిరీటి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.