పయనించే సూర్యుడు మార్చ్ 28 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు న్యూ అమరావతి నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీరామ దేవస్థానం ఆవరణములో మాజీ కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ దంపతుల ఆధ్యర్యంలో కనులపండగలా రామ కళ్యాణం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బిజెపి నాయకులు వెల్లాల మధుసూధనశర్మ మాట్లాడుతూ న్యూ అమరావతి నగర్ కాలనీలో దాదాపు ఐదు వందల కుటుంబాలు నివాసం ఉంటున్న ఒక్క దేవస్థానము కూడా లేకపోవడంతో పండుగలు శుభకార్యములు జరిగితే గుడికి వెళ్ళాలంటే దాదాపు కిలోమీటరు పైన వెళ్ళవలసి వచ్చేదని, ఇటువంటి సమస్యను ఎమ్మెల్యే డాక్టర్ పివి పార్థసారథిదృష్టికి తీసుకువెళ్ళగానే వెంటనే స్పందించి మున్సిపల్ అధికారులకు పిలిపించుకుని న్యూ అమరావతి నగర్ కాలనీలో దేవస్థానము నిర్మాణానికి అనుకూలమైన స్థలం ఉంటే పరిశీలన కేటాయింవలసినదిగా ఆదేశాలు ఇచ్చారు.వెంటనే స్పందించిన అప్పటి మున్సిపల్ కమిషనర్ కృష్ణ , టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మద్ధయ్య అమరావతి నగర్ కాలనీలో పర్యటించి గుడికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని మధుసూదన శర్మ తెలిపారు.ఈరోజు గుడి నిర్మాణం శరవేగంగా జరుగుతోందని గుడి నిర్మాణానికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదములు తెలుపుకుంటున్నామని మధుసూదన శర్మ తెలిపారు. ఈరోజు శ్రీరామకళ్యాణము కూడా ఈ గుడి ఆవరణలోనే నిర్వహించడం జరిగిందని మధుసూదన శర్మ తెలియచేసారు.పెద్ధ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారని, కళ్యాణము అనంతరము అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మాజీ కౌన్సిలర్ లలితమ్మ తెలిపారు. వివాహానికి యశోదమ్మ రామాంజనేయులు, పరుశురాముడు, శైలజమ్మ దంపతులు పంచలోహ విగ్రహాలు తయారు చేయించారని వారి కుటుంబానికి శ్రీరామ చంద్రుల వారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నామని లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి కృషి చేసిన న్యూ అమరావతి నగర్ యువకులకు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని లలితమ్మ తెలిపారు.