పయనించే సూర్యుడు మార్చి 28, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలంలోని కుచర్కల్ గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం కన్నులపండువగా జరిగింది. సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య, మంగళ వాయిద్యాల మోతతో కుచర్కల్ గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ నాయకులు చించోడు అభిమన్యు రెడ్డి, సర్పంచ్ గంగాపూర్ వెంకటయ్య గౌడ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక కల్యాణం కోసమే సీతారాముల కల్యాణం జరుగుతుందని, గ్రామంలో పాడిపంటలు బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్ తాండ సర్పంచ్ శ్రీను నాయక్, కిష్టారం శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ గౌడ్, బోయ శ్రీశైలం, అన్పూర్ కరుణాకర్ గౌడ్, వసుపుల కృష్ణయ్య, జక్క శ్రీశైలం, మంగలి రాఘవేందర్, కావలి గోపాల్, బ్యాగరి వెంకటయ్య, జక్క మల్లేష్ తదితరులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కల్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
