పయనించే సూర్యుడు,కోరుట్ల మార్చి 28 జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. శ్రీరాముల వారి కథని వివరిస్తూ పురోహితులు,భక్తులుస్వామి వారి కళ్యాణం కన్నుల పండుగగా జరిపించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసినారు.. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలయంను సందర్శించి మొక్కులు చెల్లించినారు.