గోల్లల మామిలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 28 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదపూడి మండలం గొల్లల మామిడాడలోని శ్రీ కోదండ రామాలయం (అభినవ భద్రాద్రి)లో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాల సమర్పణ శ్రీరామనవమి వేడుకల పురస్కరించుకుని ఎమ్మెల్యే నల్లమిల్లి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అత్యంత భక్తిశ్రద్ధలతో సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి తరించారు. తరలివచ్చిన భక్తజనం ఈ వేడుకలో నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీరాముని ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు.