గ్రామాల అభివృద్ధికి ముందడుగు: సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

"దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి మండల అధ్యక్షుడు రాములు "

పయనించే సూర్యుడు మార్చి 28 రాజేష్) దౌల్తాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన – గ్రామాల వారీగా నిధుల మంజూరు దౌల్తాబాద్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుపు శ్రీనివాస రెడ్డి. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలాపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. మల్లేశంపల్లి గ్రామానికి డ్రైనేజీ పనుల కోసం రూ.5 లక్షలు, షేర్‌పల్లి గ్రామానికి రూ.5 లక్షలు కేటాయించినట్లు చెప్పారు. అదేవిధంగా దౌల్తాబాద్ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మల్లేశంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా, షేర్‌పల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దౌల్తాబాద్ గ్రామంలోని డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే అంగన్‌వాడీ భవనం నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, వైస్ చైర్మన్ మద్దెల స్వామి, దౌల్తాబాద్ సర్పంచ్ అనురాధ రమేష్‌తో నర్సింలు. యశోద. రైతన్న.పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెరుకు శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *