చింతకానిలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం

పయనించే సూర్యుడు మార్చి 28, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల కేంద్రంలో శుక్రవారం శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక రామాలయం ఆవరణలో అర్చకులు ఫణిహారం గోపిచార్యులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చింతకాని సర్పంచ్ కిలారు మనోహర్ బాబు దంపతులు, చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ కమిటీ చైర్మన్ యండపల్లి శ్రీనివాసరావు దంపతులు, మాజీ దేవస్థానం చైర్మన్ మల్లెల సత్యనారాయణ దంపతులు తలంబ్రాలను సమర్పించి, కుటుంబ సమేతంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీతారామ కళ్యాణ కమిటీ సభ్యులు, మత్స్య శాఖ అధ్యక్షుడు జలగణబోయిన కృష్ణ, ఆకుల చంద్రయ్య, బండి ప్రసాద్, దేశబోయిన ఉపేందర్, గడ్డం కోటేశ్వరరావు, కోల నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.ఇక గ్రామ పెద్దలు కిలారు జగన్మోహనరావు, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, పొనుగోటి రత్నాకర్, బండి సుభద్రతో పాటు పాత్రికేయులు చిట్టూరి నరేష్, దిశ సురేందర్ మరియు చెన్నకేశవ స్వామి కళ్యాణ కమిటీ సభ్యులు, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ మేకనబోయిన రాంబాబు తదితరులు హాజరయ్యారు.పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *