చిన్నారి దుర్గా భవానికి ఆర్థిక భరోసా అందించిన తాడి నాగేంద్ర కుమార్ అభినందనీయుడు..

పయనించే సూర్యుడు మార్చి 28, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రెండు కాళ్ల ఆపరేషన్కు నిమిత్తము ప్రియా హోటల్ మేనేజ్మెంట్ అధినేత తాడి నరేంద్ర కుమార్ ఒక లక్ష 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. శుక్రవారం కాకినాడ శాంతినగర్ వద్ద గల కైరా హాస్పటల్ వద్ద డాక్టర్ వెంకట్ భార్గవ్ ఆధ్వర్యంలో హెల్పింగ్ హాండ్స్ అధినేత అనుసూరి శ్రావణి ద్వారా గ్రూప్ సభ్యులు సంయుక్తంగా కలిసి చిన్నారి దుర్గా భవాని తల్లి కర్రీ ఆదిలక్ష్మికి ఆపరేషన్ నిమిత్తం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆపదలో ఆదుకునే సంస్థ హెల్పింగ్ హాండ్స్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు దుర్గాభవానికి ఆపరేషన్ నిమిత్తము చిన్నారి దుర్గ భవానికి అండగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ప్రియ హోటల్ మేనేజర్ అధినేత తాడి నరేంద్ర కుమార్ పావని దంపతులు మాట్లాడుతూ చిన్నారికి మా వంతు సహాయం అందించాలని ఉద్దేశంతో మాకు శ్రావణి ద్వారా విషయాన్ని తెలుసుకుని ఆర్థిక భరోసా ఇస్తూ 1,25,000 ఆపరేషన్ కొరకు అందించడం జరిగిందని తెలిపారు. అలాగే ఆపదలో ఉన్నవారిని ఆదు కుంటున్న హెల్పింగ్ హాండ్స్ సభ్యులకు సంస్థ ప్రతినిధుల కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు వారు తెలిపారు. అనంతరం మద్దూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడుతున్న శ్రావణి కి సంస్థ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బి ఎల్ రాజు, బి వి భాస్కర్,సాక్షి రెడ్డి భువనేశ్వరి దంపతులు, సంస్థ సభ్యులు సునీత, ఉమామహేశ్వరి, సుష్మ,, వరలక్ష్మి, కే. లక్ష్మి, శ్రీను హర్ష, శివ,, నరేష్, ఉదయ శ్రీ, మంగలక్ష్మి, సూర్య కుమారి, దుర్గ శ్యామల, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.