పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 28 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట పట్టణం లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ పాలక వర్గం ఆధ్వర్యoలో హనుమాన్ ఆలయంలో కన్నుల పండుగగా శుక్రవారం రోజున జరిగింది .కళ్యాణ మహోత్సవ కార్యక్రమాని పంతులు రాఘవ శర్మ కళ్యాణం జరిపించారు అనంతరం వారు మాట్లాడుతూ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు చేగుంట గ్రామ ప్రజల క్షేమం కొరకు లక్ష్మీ గణపతి హోమం ధర్మతాయ హోమం చేసుకొని స్వామివారికి అంగరంగ వైభవంగా ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగినది సర్పంచ్ స్రవంతి సతీష్ చేగుంట ప్రజల క్షేమం కొరకు తలంబ్రాలు రెండు ముత్యాలు ప్రతి ఇంటికి చేరాలని ప్రతి ఆడబిడ్డ రాముని యొక్క అనుగ్రహం పొందాలని వారు సంకల్పించినారు. అమ్మవారికి వెండి బార్సింగాలు పావుతులం వస్తే బ్రహ్మం ఇచ్చారు ఆ రాముల వారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ఆయన దీవించారు .గ్రామ ప్రజలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలను, అన్నప్రసాదాన్ని స్వీకరించారు.