తిమ్మాపురం లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు..సీతారామ ఆలయంలో పీటలపై కూర్చున్న మాదారపు తాతాజీ పార్వతీ దంపతులు.

పయనించే సూర్యుడు మార్చి 28, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ తిమ్మాపురం గ్రామం బోండా వారి వీధి లో కొలువైన సీతారామ రామాలయం వద్ద తిమ్మాపురం గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో ఘనంగా సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కాపవరం సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకుని మహదరపు తాతాజీ పార్వతీ దంపతులు పీటలపై కూర్చుని ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే భారీ ఎత్తున అన్న సందర్భంగా సుమారు 6000 మందికి పైగా వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారని అన్నారు. అలాగే పీటర్పై కూర్చున్న మాదాపూర్ తాతాజీ దంపతులకు మాజీ ఏఎంసీ చైర్మన్ కర్రీ వెంకటరాజు నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరగారు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు గ్రామస్తులు పెద్దలు జనసేన నాయకులు జన సైనికులు పాల్గొన్నారు.