దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

పయనించే సూర్యుడు-28-03-2026-రాజంపేట న్యూస్ : బాటసారుల దాహార్తి తీర్చేందుకే మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని మానవతా సేవా సంస్థ ప్రతినిధులు తెలియజేశారు. ఆ సంస్థ రాజంపేట శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఆంజనేయస్వామి ఆలయం వద్ద చల్లని మినరల్ మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ కార్యదర్శి పూల నరసింహమూర్తి మంచినీటిని, డాక్టర్ టంగుటూరు రామ్మోహన్ మజ్జిగ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తలిశెట్టి రమేష్, సంస్థ అధ్యక్షులు వేణుగోపాల్ నాయుడు, కాకర్ల రాముడు, రామచంద్రయ్య నాయుడు, నందకిషోర్ గౌడ్, లయన్ అబ్దుల్లా, యూపీ రాయుడు, చినేపల్లి చంగయ్య, గంగనపల్లి వెంకటరమణ, పబ్బిశెట్టి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.