
పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 28,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో నూతనకల్ గ్రామ సర్పంచ్ తేలపుట్ట శ్రీదేవి రమేష్ దంపతులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అడపా అనిల్ చౌదరి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, అనంతరం సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని వీక్షించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అడపా అనిల్ చౌదరి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ప్రారంభించారు,వారు ఈ సందర్భంగా అనిల్ చౌదరి మాట్లాడుతూ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దయతో గ్రామ, మండల తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అనంతరం :- గ్రామ పెద్దలు కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ తేలపుట్ట శ్రీదేవి దంపతులను జిల్లా నాయకులు అడపా అనిల్ చౌదరి ను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు వీరబాబు ముదిరాజు, కళ్యాణపు వెంకటయ్య, శ్రీకాంత్,ప్రసాద్, నరేష్. ప్రేమ్ కుమార్, గోపరాజు,తదితరులు పాల్గొన్నారు..