పయనించే సూర్యుడు మార్చి 28 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ నాగర్ కర్నూల్ టౌన్ ఆకాంక్ష మార్చి:: 27::శ్రీరామ నవమి సందర్భంగా బిజినేపల్లి మండలం పాలెం గ్రామ సర్పంచ్ బోనాసి రామకృష్ణ శుక్రవారం నాడు 16 లక్షల విలువైన స్థలాన్ని రామాలయానికి ఇస్తున్నట్లు ప్రకటించి తన ఉదారత చాటుకున్నారు. పాలెం లోని రామాలయం ఆవరణలో సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన అనంతరం కళ్యాణ వేదిక పైనుండి సర్పంచ్ రామకృష్ణ రామాలయానికి 288 గజాల స్థలాన్ని ఉదారంగా ఇవ్వనున్నట్లు గ్రామ పెద్దలు, భక్తజనుల సమక్షంలో ప్రకటించారు. 16 లక్షల స్థలాన్ని తన తండ్రి బోనాసి కాశన్న జ్ఞాపకార్థం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్థల దస్తావేజులను ప్రముఖ పారిశ్రామికవేత్త జున్న శేఖర్ రెడ్డి దంపతులకు అందజేశారు. 288 గజాల విశాలమైన స్థలము కేటాయించడం వల్ల రామాలయ ప్రాంగణము అన్ని కార్యక్రమాలకు సౌకర్యవంతంగా మారనుంది. నూతన సర్పంచిగా గెలిచి ఇచ్చిన మాట కోసం స్థలాన్ని బహుకరించిన సర్పంచి రామకృష్ణను మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ దంపతులు, జున్న శేఖర్ రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ, పతంజలి సమితి రాష్ట్ర అధ్యక్షులు వస్పరిశివుడు ,వట్టెపు నాగయ్య, సొప్పరి బాలస్వామి, గాడి సురేందర్, పెద్ద కుర్మయ్య, రవీందర్ రెడ్డి, కుమ్మరి స్వామి తదితరులు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానించారు.