పయనించే సూర్యుడు: మార్చి 28/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె. విజయబాబు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు వేసవిలో ఇచ్చే ఒంటిపూట బడుల సమయపాలనను పెంచడానికి భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఖండించింది. శుక్రవారం పెనుబల్లి కేంద్రంగా నిర్వహించిన సమావేశంలో జిల్లా కార్యదర్శి తుడుం ప్రవీణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం పెనుబల్లి మండలంలోని విద్యార్థులకు ఒంటిపూట బడుల సమయపాలన పెంచడం సరైనది కాదని, ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో అలాగే దగ్గరలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గు గనుల నుండి వచ్చే వేడి వలన గాని ఈ వేసవిలో వచ్చే వడగల్పుల వలన విద్యార్థులకు నష్టం కలుగుతుంది కనుక రాష్ట్రంలో ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నారో అదేవిధంగా పెనుబల్లి మండలం లో కూడా వంటి పూట బడుల సమయపాలన నిర్వహించాలని వెంటనే దీనిపై విద్యాశాఖ ఉన్నతఅధికారులు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు వంకాయల రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయి శేషు, సత్తుపల్లి డివిజన్ అధ్యక్షులు భూక్య బాలాజీ నాయక్, డివిజన్ నాయకులు తురక అన్వేష్, ఎర్రబడి ప్రవీణ్ కుమార్, మెచ్చు కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.