పోతవరం గ్రామం శ్రీ రామ నవమి సీతారామ వివాహ మహోత్సవం.

పోతవరం గ్రామంలో శ్రీ కోదాండ రామాలయం దగ్గర సీతారాముల వివాహం అంగరంగ వైభవంగా వేడుక.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మార్చి. 28. 2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజవర్గం, దేవీపట్నం మండలం, దేవారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోతవరం గ్రామంలో శ్రీ కోదాండ రామాలయంలో శ్రీ రామ నవమి రోజున గ్రామస్తుల భాగాస్వామ్యం గ్రామంలోని గ్రామ పెద్దలు,మహిళలు,గ్రామ కమిటీ సభ్యులు, పిల్లలు, అంతా కలిసి ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేయడం. పందిళ్ళు వేయడం. వంటి పనుల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం భక్తులకు పానకం నీళ్లు పులిహార (ప్రసాదం), వితరణ కూడా నిర్వహించారు. అతిథులు, ప్రముఖులు వేడుకలు పాల్గొని. సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంగళవాయిద్యాలు, వేదమాంత్రోచ్చారణల మధ్య సీతారాముల కళ్యాణం కమనీయంగా సాగింది భక్తులందరూ.“జై శ్రీరామ్” నామస్మరణతో ఆలయ ప్రాంగాణం మారుమోగింది. వివాహం సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని, ప్రత్యేక ఆభరణాలతో, పుష్పమాలతో, ఎంతో అందంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పోతవరం గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *