
పయనించే సూర్యుడు మార్చి 28, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) వాకలపూడి గ్రామం ఫిషింగ్ హార్బర్వద్ద నూతనంగా వెలసిన శ్రీ రామ మందిరంలో ఘనంగా శ్రీరామనవమి మహోత్సవాలను నిర్వహించారు. పీటలపై శ్రీరామచంద్రుడు నూక రత్నం దంపతులు, దండిప్రోలు శ్రీను కాసులమ్మ దంపతులు, పాలపు కృష్ణంరాజు దంపతులు, పాలకు ఈశ్వరరావు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పాలెపు శివకుమార్ మాట్లాడుతూ 30 సంవత్సరాల కల 2026 మార్చి 23న తీరిందని ఆరోజు ఫిషింగ్ హార్బర్ లో శ్రీ కోదండరామ మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నూతన ఆలయంలో తొలిసారి శ్రీరామనవమి మహోత్సవము ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించమని అన్నారు. అలాగే మాకు అన్ని విధాల సహకరిస్తున్న ఎమ్మెల్యే కి నానాజీ ఫిషింగ్ ఆర్బర్ ప్రజలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు.