బిజెపి వ్యతిరేకులకు చావు దెబ్బ..దేశ ప్రజలకు శుభవార్త

బీజేపీ ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున

పయనించే సూర్యుడు మార్చి 28 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొని, ఇంధన ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో కూడా భారతదేశ ప్రజలపై భారం పడకుండా చూడాలని సంకల్పంతో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకొని పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ ఆదోని పట్టణ సెంట్రల్ అధ్యక్షులు తోవి నాగార్జున పేర్కొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని అనేక దేశాలలో ఇంధన ధరలు పెరుగుతున్నప్పటికీ, భారతదేశంలో మాత్రం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ధరలను తగ్గించడం ప్రజల పట్ల ఉన్న బాధ్యతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశ ప్రజలకు ఊరట లభించిందన్నారు.
ప్రత్యేకంగా పెట్రోల్‌పై సుంకం భారీగా తగ్గించడం, డీజిల్‌పై పన్నులను పూర్తిగా తగ్గించడం ద్వారా రవాణా ఖర్చులు తగ్గి, దాని ప్రభావం అన్ని రంగాలపై సానుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రైతులు, వ్యాపారులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కట్టుబడి పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశ ప్రజల పట్ల తన బాధ్యతను మరొకసారి చాటుకుందని, ఇందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తోవి నాగార్జున గారు పేర్కొన్నారు.