పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 28 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మద్యం మత్తు, అతివేగం తోడై వినాయకపురంలో ఒక కారు బీభత్సం సృష్టించింది. నారాయణపురం నుంచి వస్తున్న కారు అదుపుతప్పి గ్రామ బొడ్డురాయిని బలంగా ఢీకొట్టిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న యువకులు మద్యం సేవించి ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగనప్పటికీ, వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది.