మక్కజొన్న క్రాస్-9 కోతకాల దినోత్సవం ఘనంగా నిర్వహణ – రైతులలో ఉత్సాహం

దాడి శ్రీనివాస్ రీజినల్ మేనేజర్ తెలంగాణ మరియు ఆంధ్ర. టి ఎస్ ఎం రాజు

పయనించే సూర్యుడు మార్చి 28 రాజేష్) రాయపోలు మండల పరిధిలోని గ్రామంలో ఉషణగాళ్ల స్వామి పొలంలో యశోద సీడ్స్ కంపెనీ వారి నూతన మక్కజొన్న రకం క్రాస్-9 పై కోతకాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో రైతులు హాజరై పంటను పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వచ్చే పంట కాలంలో క్రాస్-9 మక్కజొన్నతో పాటు వరి జై శ్రీరామ్ గోల్డ్ సాగు చేసి అధిక దిగుబడి సాధించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నూతన రకం రోగాలను తట్టుకొని అధిక దిగుబడి ఇస్తుందని యశోద సీడ్స్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. యశోద సీడ్స్ కంపెనీ రీజినల్ మేనేజర్ దాడి శ్రీనివాస్, ఏరియా మేనేజర్ రాజు మాట్లాడుతూ, క్రాస్-9 మక్కజొన్న సాగు ద్వారా రైతులు అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు. రైతులు ఈ నూతన విత్తనాలను ఉపయోగించి లాభాలు పొందాలని సూచించారు. వెంకటేశ్వర ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్ సంతోష్ మరియు షరుముఖ ట్రేడర్స్ నందం మాట్లాడుతూ, మంచి దిగుబడి మరియు లాభాలు పొందాలంటే నాణ్యమైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని, విత్తనాలతో కూడా మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. రైతులకు మంచి విత్తనాలు అందించాలని ఆయన ఆకాంక్షించారు. రైతు ఉషణగాళ్ల స్వామి మాట్లాడుతూ, యశోద విత్తనాలను ఎన్నో సంవత్సరాలుగా సాగు చేస్తూ మంచి లాభాలు పొందుతున్నానని, ఇతర రైతులు కూడా ఈ విత్తనాలను ఉపయోగించి అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు స్వామి, కిష్టారెడ్డి, దశమంతా రెడ్డి, నర్సింగా రావు తదితరులు పాల్గొన్నారు.