పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 28 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ): పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అవినీతి నిరోధక శాఖ తెలుగు రాష్ట్రాల వైస్ ప్రెసిడెంట్ మచారి నాగమృత్యుంజయ శర్మ ఆధ్వర్యంలో గురువారం మానవ హక్కుల అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానవ హక్కుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్ చల్లా రమేష్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అందుకే మండల కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో బత్తుల రవి కుమార్,కె. వాసవి,తమదాల కృష్ణరెడ్డి,కె.వీర రెడ్డి,ఎ.గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.