యడ్లపాడు మండల యువత అధ్యక్షుడిగా కొప్పుల శ్యామ్ పాల్ ఎన్నిక…

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 28 యడ్లపాడు మండల ప్రతినిధి పల్నాడు జిల్లా యడ్లపాడు మండల యువత అధ్యక్షుడిగా తిమ్మాపురం గ్రామానికి చెందిన కొప్పుల శ్యామ్ పాల్ ఎన్నిక కావడంతో మండల స్థాయి నాయకులు, పార్టీ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మరియు కార్యకర్తలు ప్రచార మాధ్యమాల ద్వారా శ్యామ్ పాల్‌కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. శ్యామ్ పాల్ గతంలోనే పార్టీ పట్ల తన నిబద్ధతను, చురుకైన పాత్రను నిరూపించుకుని యువతలో మంచి గుర్తింపు పొందారు. ఆయన ఎన్నికతో మండలంలో యువతకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ పాల్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పగించిన పార్టీ అధిష్టానం మరియు మాజీ మంత్రి విడదల రజినికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పదవిని ఒక పెద్ద బాధ్యతగా తీసుకొని, రానున్న రోజుల్లో యువతను పార్టీ వైపు ఆకర్షిస్తూ, వారి శక్తిని సమీకరించి పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు యువతను చైతన్యపరచి, పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేలా చేయడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు…