రామదుర్గం కొండపై కనులపండువగా సీతారాముల కళ్యాణం.

* భక్తిశ్రద్ధలతో తరలివచ్చిన భక్తజనం. * రాజకీయ ప్రముఖుల సందడి.

పయనించే సూర్యుడు ప్రతినిధి సాగర్ మర్చి. 28.2026 పోలవరం జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామదుర్గం కొండ శ్రీరామనవమి. వేడుకలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పచ్చని ప్రకృతి ఒడిలో వెలసిన ఈ ఆలయంలో ప్రతి ఏటా నిర్వహించే సంప్రదాయం ప్రకారం, ఈ ఏడాది కూడా సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.​క్లిష్టమైన మార్గంలోనూ తగ్గని భక్తి ​సుమారు మూడు కిలోమీటర్ల మేర అత్యంత క్లిష్టమైన కొండ మార్గం ఉన్నప్పటికీ, భక్తుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అడవి మార్గంలో కాలినడకన ప్రయాణించి, వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కొండపై జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి, అనంతరం తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు. తరలివచ్చిన ప్రముఖులు.​ ఈ వేడుకల్లో పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారిలో ​బత్తుల బలరామకృష్ణ (ఎమ్మెల్యే) ​సోము వీర్రాజు (బీజేపీ ఎమ్మెల్సీ) ​బొట్టు వెంకటరమణ చౌదరి (రాజమండ్రి పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు) ​మట్ట మంగరాజు (గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్) ​వీరికి కూటమి నాయకులు మండల అధ్యక్షులు గోళ్ళ చంటిబాబు, సొసైటీ అధ్యక్షులు మాగాపు బాబురావు, మాజీ మండల అధ్యక్షులు ముండ్రు మధుసూదన్ రావు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి, ఆలయ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో రేలంగి రాంబాబు, కుటుంబ రెడ్డి, సూరి వెంకటేశ్వరరావు యాండ్రా ఆంజనేయులు, జొన్నల రాంబాబు తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏపీ ఆర్ చౌదరి,మట్ట మంగరాజు కోరిక మేరకు డాక్టర్ రవి వర్మ 20వేల మందికి భోజన వసతులు కల్పించారు అదేవిధంగా స్వామి వారి దగ్గరికి వెళ్లడానికి రోడ్డు మార్గాన్ని మెరుగుపరిచారు మరియు శివాజీ పితాని వారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *