పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చ్28.03.2026 మదనపల్లి అన్న మయ్య జిల్లా పుంగ నూరు నియో జక వర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె నాగరాజ) శ్రీరామనవమి వేడుకలను మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు ప్రతి గ్రామంలోనూ సీతారాముల ఆలయంలో విశేష పూజలు జరిగాయి గడ్డం వారి పల్లి వద్దగల వీరాంజనేయ స్వామి ఆలయంలో మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండుగల జరిగింది అంతేకాకుండా అగ్రహారం ఆనందాచార్యుల ఆధ్వర్యంలో బిల్లేరు గ్రామంలో సీతారాముల కల్యాణోత్సవం రాత్రి వీధి నాటకం వంటివి నిర్వహించారు దీంతోపాటు చౌడేపల్లి పట్టణంలోని హరిమందరంలో ఆర్యవైశ్యులచే సీతారాములకు వివిధ అభిషేకాలు అలంకరణ పలు కార్యక్రమాలు నిర్వహించారు శ్రీరామ నవమిని పురస్కరించుకున గాండ్ల పల్లె లో విరాజిల్లుతున్న శ్రీ శ్రీ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలోి అత్యంత వైభవంగా ప్రత్యేకపూజలు నిర్వహించారువాడ వాడల శ్రీ లక్ష్మణ హనుమాన్ సీత సమేత శ్రీరామచంద్రుడికి విశేష పూజలు జరిగాయి