వైష్ణవి దేవి ఆలయంలో నవమి పూజలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ మార్చి 28.03.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో వసంత నవరాత్రుల్లో 9వ రోజున అనగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయ అర్చకరాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి, అభయాంజనేయ స్వామికి, పంచామృత అభిషేకం చేసి అనంతరం రంగురంగుల పూలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు .చౌడేపల్లి పుంగనూరు చుట్టుపక్కల గ్రామ ప్రజలు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అమ్మవారి సన్నిధిలో సౌందర్యలహరి లలితా సహస్రనామ పారాయణం చేశారు. ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *