
పయనించే సూర్యుడు, మార్చ్ 28, దేవరకొండ టౌన్ న్యూస్ రిపోర్టర్, వల్లపు నరేష్ నల్గొండ జిల్లా. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనది. బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలి అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా దేవరకొండ పట్టణంలోని కోదండ రామాలయంలో 4వ వార్డులో హరిహర దేవస్థానంలో మాజీ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి రోజున ప్రతిఏటా వైభవోపేతంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటారని అన్నారు. లోక కళ్యాణం కోసం ఎన్నోత్యాగాలను కోర్చిన సీతారాముల పవిత్ర బంధం అజరామరమైనదని, రాబోయే తరాలకు ఆదర్శనీయమైనదని ఆయన తెలిపారు. సీతారాముల ఆశీస్సులు ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని సీతారామచంద్రమూర్తులను ప్రార్ధించనున్నట్టు ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలి అని ఆయన అన్నారు.దైవచింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని అయన తెలిపారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి అని అయన అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ని ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్ , బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీవీఎన్.రెడ్డి, గాజుల ఆంజనేయులుకౌన్సిలర్ పొట్ట మురళి, పొట్ట మధు,వనం జగదీశ్వర్, గాజుల రాజేష్, జింకల లింగయ్య, , పగిడిమర్రి నాగరాజు, హరిలాల్, పాత్లవాత్ లక్ష్మణ్, నేనావత్ నాగార్జున, జెల్ల అంజి, జింకల మధు, మొత్తిరామ్, సత్తయ్య, నర్సింహ, చారి, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.