శ్రీరామనవమి ఉత్సవాలలో శ్రీ సత్యసాయి భజన మండలి కల్వచర్ల సేవలు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -28:- పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం సింగరేణి ప్రాంతం సెంటనరీ కాలనీలోని కోదండరామాలయం ఆవరణలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి పర్వదిన వేడుక సీతారాముల కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన అశేషభక్తజన అవసరార్ధ సేవకోసం కల్వచర్ల శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో ఉచిత పాదరక్షల శిబిరం నిర్వహించారు.కల్వచర్ల శ్రీసత్యసాయి భజన మండలి కన్వీనర్ నూక రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరం ఉదయం ఆలయ కమిటీ చైర్మన్ మరియు లద్నాపూర్ సర్పంచ్ వనం రాంచందర్ రావు, సింగరేణి ఆర్జీ3, అడ్రియాలా ప్రాజెక్ట్స్ జనరల్ మేనేజర్లు మధుసూదన్, కొలిపాక నాగేశ్వర్ రావులు శ్రీసత్య సాయి ఫోటోకు పూలమాలతో ప్రార్థన చేసి టెంకాయలు కొట్టి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో శ్రీసత్యసాయి సమితి సభ్యులు కాంటెవాడ బుగ్గాజీ, జి.రాజయ్య, బూర్ల ఎల్లయ్య, మదనయ్య, కనకమ్మ, వరుణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరి సేవను గుర్తించిన ఆలయ కమిటీ, హాజరైన పుర ప్రముఖులు, భక్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.