పయనించే సూర్యుడు మార్చి 28 డివిజన్ ప్రతినిధి సిరందాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ దేవరకొండ ఖిల్లా బజార్‌లోని శ్రీ ఆంజనేయ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణ tc మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ పుణ్య కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని శ్రీ సీతారాముల దివ్య కళ్యాణాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య సంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. ఆలయాన్ని అందంగా అలంకరించడంతో పాటు ప్రత్యేక పూజలు, హారతులు ఘనంగా పెంచడం జరిగింది ఈ సందర్భంగా భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడింది. కార్యక్రమం విజయవంతం కావడానికి ఆలయ కమిటీ సభ్యులు, ఎంతో కృషి చేశారు. ఈ మహోత్సవం భక్తి, ఐక్యత, సంప్రదాయాల ప్రతీకగా నిలిచిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఆలయ కమిటీ ఖిల్లా బజార్, దేవరకొండ