
పయనించే సూర్యుడు మార్చి 28 కరీంనగర్ న్యూస్: కరీంనగర్ నగరపాలక సంస్థ 8వ డివిజన్ అలుగునూర్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో గల శ్రీ పట్టాభిరామ , శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవ వేడుక లుఅంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు తిరునగిరి వెంకటాద్రి స్వామి, తిరునగిరి హర్షవర్ధన్ స్వామి ల వేదమంత్రోత్సవాల తో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుక కన్నుల పండుగ గా కొనసాగింది. ఈ సందర్భంగా వేద పండితులు తిరునగరి వెంకటాద్రి స్వామి మాట్లాడుతూ ధర్మరక్షణలో, ఆదర్శ పరిపాలనకు నిదర్శనం మన శ్రీరామచంద్రుడన్నారు. ధర్మాన్ని కాపాడేందుకు జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు శ్రీ రామచంద్ర ప్రభువేనన్నారు. హిందూ బంధువులందరూ రాముడి అడుగుజాడల్లో నడుస్తూ , ధర్మబద్ధంగా జీవిస్తూ, ఐక్యంగా ముందు కొనసాగాలన్నారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 18న తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ ( సుభాష్ నగర్ ) లో నిర్వహిస్తున్న హిందు సమ్మేళనం ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హిందూ ఐక్యతనే హిందూ సమాజానికి పెద్ద బలం లాంటిదన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కళ్యాణ మహోత్సవానికి అశేష సంఖ్యలో తరలివచ్చిన భక్తులకుతీర్థ, ప్రసాదము, అన్న ప్రసాద వితరణ చేపట్టారు . కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న డివిజన్ కార్పొరేటర్ కాల్వ మల్లేశం, మహాత్మా నగర్ సర్పంచ్ పొన్నాల సంపత్, మాజీ ఎంపీపీ కుంట రాజేందర్ లను దేవాలయ కమిటీ సన్మానించింది. ఈ కార్యక్రమంలో శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయ ధర్మకర్తల సేవాసమితి అధ్యక్షులు చిందం నరసయ్య, గడప శేఖర్, సల్ల రాజయ్య, మల్లేశం, సిరిపురం శ్రీనివాస్, చిందం ముత్యం , ఐతం వెంకన్న, శంకర శర్మ , బూట్ల కర్ణాకర్ , రాజేందర్, సుధాకర్ రెడ్డి, రాజిరెడ్డి, కుమార్, మొగిలి , మధు, మహేందర్, మృత్యుంజయం , నారాయణ, భరత్, చిందం అంజి, కొత్తూరి శ్రీనివాస్ , సాయి, అక్షయ్ , రేవంత్ లతోపాటు మహిళా భక్తులు తదితరులు అశేష సంఖ్యలో పాల్గొన్నారు.
