సీజ్ చేసిన కార్ల వెంటనే తిరిగి ఇవ్వాలని కాకినాడ కలెక్టరేట్ ముందు ఆందోళన..

పయనించే సూర్యుడు మార్చి 28 ఎస్సీ అభ్యర్థులకు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని ఉద్దేశంతో ఆనాడు ఎన్ఎస్ఎఫ్డిసి కార్లను రుణంఅందించడం జరిగిందని కానీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంటికి సుమారుగా 15 ,18 మంది వచ్చి కార్లను తీసుకెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసమని నాయకులు కుసుమే ప్రవీణ్, ఎస్సీ నాయకులు సిద్ధాంతపు కొండబాబు మరియు ఏనుగుపల్లి కృష్ణ లు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాన్ని లబ్ధిదారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా జీవనోపాధి నిమిత్తము ఆనాడు కార్లు ఇచ్చారని అయితే మేము కార్లు తీసుకున్న తర్వాత మా కారులను గవర్నమెంట్ ఆఫీసుల్లో ప్రత్యేక పెట్టుకున్నామని అయితే అప్పటిలో కరోనాతో కొంత ఇబ్బందులకు గురయ్యామని ఆనాడు లోకేష్ బాబు పాదయాత్రలో భాగంగా కార్లకు ఇచ్చే రుణమాఫీ ని మాఫీ చేస్తామని మాటిచ్చారని కానీ నేటి వరకు నిలబెట్టుకోలేదని అన్నారు. వేలకోట్లలో ఇతరులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాఫీ చేస్తుంటే మా దళితులపై చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఏప్రిల్ 30 వరకు మాకు సమయం ఉన్న ఎస్సీ కార్పొరేషన్ అధికారులు, ఈడీలు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వచ్చి మాపై జూలూరు ప్రదర్శిస్తున్నారని మమ్మల్ని ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా కార్ల లబ్ధిదారులు ఎస్సీ నాయకులు తదితరులు కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *