సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు

- ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన శ్రీను బాబు

పయనించే సూర్యుడు న్యూస్, పెద్దపల్లి, సెంటినరీ కాలనీ -28 రామగిరి మండలం, పన్నూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సెంటేనరి కాలనీ టౌన్, మరియు వకీల్ పల్లె ఫ్లాట్ లోని శ్రీ కోదండ రామాలయం, శిరిడి సాయిబాబా మందిరం ప్రాంగణం అభయాంజనేయ స్వామి దేవాలయాలలో కళ్యాణ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు , తొట్ల తిరుపతి యాదవ్, పన్నూర్ గ్రామ సర్పంచ్ చిందం మహేష్ తో కలిసి స్వామి వారి పల్లకి సేవలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల వారి ఆశీస్సులు పొందారు.​అనంతరం భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు. తీర్థప్రసాదాలు అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…​రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఆలయ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు యూత్ నాయకులు, మహిళలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *