సీతారాముల కల్యాణానికి గ్రామపంచాయతీ తరుపున పట్టు వస్త్రాలు సమర్పించిన సర్పంచ్ శేషమ్మ

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 28,తల్లాడ రిపోర్టర్ కుర్నవల్లి గ్రామంలోని మర్రిచెట్టు సెంటర్ రామాలయం వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణానికి గ్రామపంచాయతీ తరఫున సర్పంచ్ ఎక్కిరాల శేషమ్మ దంపతులు పట్టు వస్త్రాలు తలంబ్రాలు అందజేశారు అనంతరం స్వామివారి కల్యాణాన్ని అర్చకులు అవధానుల రవికుమార్ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం సర్పంచ్ ఎక్కిరాల శేషమ్మను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుహాసిని మాజీ సర్పంచులు గంటల రమాదేవి, ఐలూరి లక్ష్మి, రామాలయ కమిటీ చైర్మన్ గుర్రాల లక్ష్మారెడ్డి, గ్రామ పెద్దలు ఐలూరి వెంకట కోటారెడ్డి ఐలూరి శివారెడ్డి గంటల వెంకటాచారి పోతురాజు వెంకటయ్య ఎక్కిరాల వెంకటేశ్వర్లు ఆదూరి బుచ్చాలు గుర్రాల రమణారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *